స్టేట్ ఫస్ట్ విధ్యార్థినికి ఆరెపెల్లి మోహన్ అభినందనలు
రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన అనుముల అంకిత అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపిసి 437/440 స్టేట్ మొదటి ర్యాంక్ సాధించింది. దీంతో మాజీ శాసన సభ్యులు, విప్ ఆరెపెల్లి మోహన్ స్వయంగా వల్లంపట్లలోని కొత్తపల్లిలోని వారి ఇంటికి వెళ్లి అంకిత ని, వారితల్లిదండ్రులను శాలువాతో సత్కరించి సన్మానించారు. గ్రామానికే కాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరును రాష్ర్ట స్థాయిలో నిలిపినందుకు సంతోషంగా ఉందన్నారు. మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, డాక్టర్ అయ్యి ఎంతో మందికి సేవలను అందించాలని మోహన్ తెలిపారు. అంకితను ఆదర్శంగా తీసుకోని ప్రతి ఒక్కరు కష్ట పడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ మాజీ చైర్మన్ భూంపెల్లి రాఘవరెడ్డి, ముక్కీస కేశవరెడ్డి, చిట్టి ఆనందరెడ్డి, కట్ట గురువారెడ్డి, గజ్జల రాజశేఖర్ గౌడ్, ఎలుగందల బాలయ్య, ఎలుగందల ప్రసాద్, జాగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.