నేరుగా విత్తే వరి సాగు పై క్షేత్ర స్థాయి లో అవగాహన కార్యక్రమం
ఈ రోజు ఇల్లంతకుంట మండలం లోని రేపాక క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారిని రవళి నేరుగా విత్తే వరి సాగు పై క్షేత్ర స్థాయి లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.రైతులు వరి విత్తనాలు నేరుగా విత్తడం వలన వర్షపు నీటిని సమయానికి వినియోగించుకోవచ్చని మరియు నాట్లు వేయడానికి అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చని వివరించారు.సమయానుకూలంగా కలుపు నివారణ చర్యలు చేపట్టడం డం వలన తక్కువ సాగు ఖర్చు తో అధిక దిగుబడులు పొందవచ్చని వివరించారు. కలుపు నివారణ కు గాను విత్తిన 48 గంటల లోపు పెండి మితాలిన్ , ప్రిటిలాక్లోర్ వంటి కలుపు మందులు పిచికారీ చేయాలని వివరించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.