27 జూలై, ఇల్లంతకుంట :
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో తహసిల్దార్ ఆఫీస్ ముందర మండల వీఆర్ఏలు మూడు రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు వారికి ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడం జరిగింది వారి నాణ్యమైన కోరికను ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన మాటను నీల పెట్టుకోవాలి అని అడుగుతున్నారు తప్ప వారు గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు మీరు చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని వీఆర్ఏల తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది లేని ఎడల మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వీఆర్ఏలు ఏ ఉద్యమం తీసుకున్నా పూర్తి అండదండలు వారికి ఉంటాయని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుల వెంకటి జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్ రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ముత్యాల మల్లారెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి జమాల్ టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ గాలి పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మంజూర్ అలీ మండల నాయకులు మచ్చ రాజేశం మండల సీనియర్ నాయకులు సాంబార్ అంజయ్య తిరుపతి గౌడ్ బాబు రజినీకాంత్ వీరేశం నరేందర్ రెడ్డి రాజు ముజాఫర్ లింగం తదితరులు పాల్గొనడం జరిగింది.
వీఆర్ఏల రిలే నిరాహార దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం
July 27, 2022
0
Tags
Share to other apps