29 జూలై , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామానికి చెందిన కట్ట నరసింహ చారి (మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత సహాయక అధికారి) తల్లి కట్ట సత్తమ్మ మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు,దళిత సంఘాల నాయకులు, వోరగంటి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.