శాలివాహన యువజన విభాగం అధ్యక్షుడిగా అశోక్
జనం న్యూస్, 8 ఆగస్టు, ఇల్లంతకుంట :
తేది : 07-08-2022 రోజున తెలంగాణ రాష్ట్ర శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలకిషన్ ప్రజాపతి మరియు రాష్ట్ర ఎంబీసీ చైర్మెన్ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా శాలివాహన యువజన నాయకులు నెల్లుట్ల మహేష్ మరియు చిమ్మనగొట్టు శేఖర్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల శాలివాహన యువకులు ఇల్లంతకుంట మండల కేంద్రంలో సమావేశమై శాలివాహన మండల యువజన విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి మండల శాలివాహన యువజన విభాగం అధ్యక్షునిగా సోమారంపేట గ్రామానికి చెందిన మూడపెల్లి అశోక్ ను, ఉపాధ్యక్షులుగా మూడపెల్లి వంశీ, ప్రధాన కార్యదర్శిగా మద్దికుంట తిరుపతి మరియు చీర్లవంచ సాయివర్మ, కోశాధికారులుగా ఎలగందుల సాగర్, ఎలగందుల కార్తిక్, మరియు సలహాదారులుగా నాంపెల్లి హరీష్, చిమ్మనగొట్టు వేణులను యువజన విభాగ సభ్యులందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఇట్టి సమావేశంలో విభాగ సభ్యులు గంగాధర మనోజ్, నాంపెల్లి యాదగిరి, నాంపెల్లి సత్యనారాయణ, మద్దికుంట అనిల్, మద్దికుంట కిరణ్, మూడపెల్లి మధు, మూడపెల్లి శ్రీనివాస్, మూడపెల్లి సంపత్, కోడిశేల మల్లేష్, మద్దికుంట మహేష్, ఎలగందుల ప్రశాంత్, ఎలగందుల పర్షరాములు, చిమ్మనగొట్టు శ్రీనివాస్, చీర్లవంచ సంపత్, చీర్లవంచ లింగం, చీర్లవంచ సాయిరాం, చీర్లవంచ ప్రశాంత్, చీర్లవంచ అభిరాం, మూడపెల్లి అనిల్, మూడపెల్లి కోటి, కోడిశేల వంశీ, నాంపెల్లి మధు, నాంపెల్లి శేఖర్, నాంపెల్లి సుధాకర్, నాంపెల్లి రాజు, విలాసాగర్ రమేష్, చీర్లవంచ శ్రావణ్, కొడిశెల తిరుపతి, కొడిశెల శ్రీనివాస్ కొడిశెల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మండల శాలివాహన యువజన విభాగం అధ్యక్షులు మూడపెల్లి అశోక్ మాట్లాడుతూ మండల శాలివాహన యువజన విభాగం అధ్యక్షునిగా ఎన్నికైననందుకు సంతోషం వ్యక్తం చేస్తూ యువజన విభాగ అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపినారు.