పండక్కి ఊరికి వెళ్తున్నారా - జర జాగ్రత్త

0
పండక్కి ఊరికి వెళ్తున్నారా - జర జాగ్రత్త
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి సొంత గ్రామాలకు వెళ్ళు ప్రజల గురించి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు తగు జాగ్రత్త, సూచనలు చేసినారు

 1.ఉదయం/పగలు వేళలల్లో పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, తదితర వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలి, 
2. రాత్రివేళ అనుమానంగా కాలనీలో సంచరించేవారి గురించి పోలీసులకు సమాచారం వేంటనే అందించాలి. 
3. శివారు కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలని. 
4. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దన్నారు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిదని సూచించారు. 
5. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు.  
6. పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిదన్నారు.
 7. ఇంట్లో కుటుంబసభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు. 
8. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదన్నారు. వాటిని బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవాలన్నారు. 
9. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడంమంచిదన్నారు.
10. పోలీస్‌శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని కోరారు.  
11. ప్రత్యేకంగా చుట్టు పక్కల వారి ల్యాండ్‌ఫోన్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.  
12. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు సమీప పోలీస్‌స్టేషన్లను సంప్రదించాలని తెలిపారు. 
13. రాత్రి సమయంలో బీట్, మరియు పెట్రోలింగ్ గస్తి ముమ్మరం చేయబడును, 
14. బయటికేల్లేటప్పుడు తాళలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
15. పండుగల వేళ బస్ స్టేషన్లు కిక్కిరిసి ఉండటం సహజం. ఆ సమయంలో బస్సు ఎక్కే క్రమంలో తోపులాటలో దొంగలు  పాకెట్ లో ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్లు కొట్టివేయడం మరియు మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు తెంపుకొని పారిపోవడం చేస్తుంటారు !
16.బస్సు ఎక్కే క్రమంలో తోపులాట లేకుండా చూసుకోవలెను !
17.. ప్రజలు ఎలాంటి సమాచారం ఇవ్వాలన్న డయల్ 100 కాల్,  మీ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ గారు  సూచించారు.

పై జాగ్రతలు పాటించండి - బతుకమ్మ - దసరా వేడుకలు మధుర స్మృతిగా మిగుల్చుకోండి !!

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top