వడ్లు తూకం వేయాలని రైతులకు మద్దతుగా బీజేపీ నాయకుల ధర్నా
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల గాలిపెల్లి మరియు తాళ్లపెళ్లి గ్రామ లో వడ్లు తూకం వేయాలని. తాళ్లపెళ్లి గ్రామ బస్టాండ్ దగ్గర రోడ్లు పై రైతు లకు మద్దతుగా రాస్తా రోకా చేసిన మండల బీజేపీ నాయకుడు
ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి వడ్ల సెంటర్లో రైతులు వడ్లు పోసి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వడ్లు కంఠ (తూకం ) వేయకపోవడంతో రైతులు రాత్రి పగలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం, వర్షం పడితే ఎండిన ధాన్యం పూర్తిగా తడిసిపోతుంది అని భయాందోళన చెందుతూ కన్నీళ్లు పెడుతుంటే రైతుల కన్నీళ్లు తుడిసెందుకు ఉదయం 10 గంటల నుండి రైతులకి మద్దతుగా రాస్తా రోకా చేసిన మండల బీజేపీ నాయకులు బెంద్రం.తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతు రైతులు ఆరు కాలం కష్టపడి వరి ధాన్యాన్ని పండించి వడ్లను కొనుగోలు కేంద్రాలలో పోసి 15 రోజులు అవుతున్న ఇంతవరకు కాంట్టలు వేయకుండా రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నా కెసిఆర్.వెంటనే తెలంగాణా రాష్ట్రము లోని ప్రతి గింజ కొనుగోలు చేయాలనీ, వీటికి బీజేపీ కేంద్ర ప్రభుత్వమే 60 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తే, ఈ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను మోసం చేయడానికి అబద్దాలు చెప్తున్నారు,గత కేంద్ర ప్రభుత్వం 2014 సం లో 3401 కోట్ల తో ధాన్యం కొనుగోలు చేస్తే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం 20-21 సం నికి 26,641 కోట్ల రూపాయలతో ధాన్యాన్ని కొనుగోలు చెస్తున్నాదన్నారు, అసలు విషయాలు దాచిపెట్ట కెసిఆర్ రైతులు మభ్యపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, వెంటనే తూకం స్టార్ట్ చేయాలని 5 గంటల పాటు రైతులతో కలిసి రాస్తా రోకా చేస్తుంటే గౌరవ మండల తహసీల్దార్ గారు రేపు ఉదయం నుండి వడ్లు కాంట్టలు ప్రారంభిస్తామని. చెప్పడంతో రాస్తా రోకా విరమించిన రైతులు బీజేపీ నాయకులు, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, మండల కార్యదర్శి సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, సుదగోని శ్రీకాంత్, ఎల్లారెడ్డి, కిష్టారెడ్డి, తిరుపతి రెడ్డి, కిరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,బాబు, రాజరెడ్డి, మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి,రమేష్, కిష్టయ్య తదితరులు పాలుగోన్నారు..