చింతలకుంటపల్లి -గొల్లపల్లి గ్రామాలకు బీ.టి రోడ్ నిర్మాణం చేయాలనీ గ్రామ ప్రజలకి మద్దత్తుగా బీజేపీ నాయకులు రాస్తా రోకా
ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి -చింతలకుంటపల్లి బి. టి రోడ్ నిర్మాణం చేయాలనీ గ్రామాల ప్రజలతో కలిసి రాస్తా రోకా చేస్తూ బెంద్రం.తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడతూ చింతలకుంటపల్లి -గొల్లపెల్లి గ్రామాలకు రోడ్ లేకపోవడంతో బస్సు సౌకర్యం కూడా లేదు, కనీసం సిలిండర్ ఆటో కూడా రాదు, ఏదయినా అత్యవసర ప్రమాద పరిస్థితిలాల్లో ప్రజలు కనీసం ఆసుపత్రి కి వెళ్లాలంటే కూడా రోడ్ లేక అంబులెన్సు, కానీ కార్, ఆటో కూడా పోరాదు, ఈవిధంగా ఏ వాహనాలు ఆ గ్రామలలోకి రాకపోతే, ఒక్కరిని ఆసుపత్రి కి బైక్ పైనా తీసుకెళ్లంతుంటే రోడ్ లేక గుంతల్లో పడి చనిపోయిన ఇప్పటికి రోడ్ నిర్మాణ పనులు చేపట్టకపోవడం MLA గారికి అవమానం కదా! ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ శిలా పాలకాలు వేసారా మరి తేది 11-04-2018 రోజున 3కోట్ల 54లక్షల వ్యయంతో బి.టి రోడ్ నిర్మాణం మంజూరు చేసినట్టు గా శీలపాలకం వేసిన MLA రసమయి బాలకిషన్ గారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఐతే పనులు మొదలు పెడతారో చెప్పాలన్నారు, మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోనిదే కదా మరి ఈ చింతలకుంటపల్లి -గొల్లపల్లి గ్రామాలు కూడా మీ నియోజకవర్గం లోనివే కదా మ్మెల్యే గారు ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు,మా మండలం పైన అంటూ,బస్సు రాని ఊర్లు ఇంకా ఉన్నాయి అంటే మీకు సిగ్గుచేటు కదా!అంటూ మండిపడ్డారు. గౌll MPP వి.రమణారెడ్డి గారు ఫోన్ చేసి మూడు నెలలో రోడ్ నిర్మాణం పనులు చేపిస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలందరం రాస్తా రోకా విరమిస్తున్నామన్నారు,ఇప్పటికైనా గౌll MPP గారు, గౌll MLA రసమయి బాలకిషన్ గార్లు తక్షణమే బి.టి రోడ్డు నిర్మాణ పనులు చేపించి ఆ గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు వెంకటరెడ్డి, తిరుపతి,వెంకటేష్, మోహన్, సురేష్, రాహుల్, మల్లయ్య, బాలయ్య, రమేష్, రమణ, అశోక్,మాధవరెడ్డి,రవి, శ్రీనాథ్ లతో,బీజేపీ నాయకులు బత్తిని స్వామి,బండారి రాజు, మామిడి.హరీష్,వజ్జపెల్లి.శ్రీకాంత్, గజ్జల.శ్రీనివాస్,పల్లె.సాయి ప్రసాద్ రెడ్డి,పున్ని రాజు,గుంటి తిరుమల్,నర్సింహారెడ్డి, రాజిరెడ్డి,శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు.