_"క్లాసుల నిర్వహణ లేకుండా పరీక్షలు నిర్వహించడం సరైంది కాదు,ఫెయిల్ అయిన విద్యార్థులకు బేషరతుగా పాస్ మార్కులు వెయ్యాలి"_
"ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిరసన"
ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు మంద అనిల్ కుమార్...
SFI ( భారత విద్యార్థి ఫెడరేషన్) ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో క్లాసుల నిర్వహణ లేకుండా పరీక్షలు నిర్వహించడం వల్ల తీవ్రంగా నష్టపోయిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేయాలని,బేషరతుగా పాస్ మార్కులు వేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది...
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పీజుల దోపిడీ చేయడానికి శ్రీ చైతన్య నారాయణ తదితర కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడికి తలొగ్గిన ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల సౌకర్యాలు లేనీ,గ్రామీణ,ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినకపోవడం వల్ల పరీక్షలు సరిగా రాయలేని పరిస్థితి తలెత్తింది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలలో ఫెయిల్ అయ్యారు.
దీంతో గ్రామీణ ప్రాంత,ప్రభుత్వ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగింది.కావున విద్యార్థులకు న్యాయం చేయాలని, ఫెయిల్ అయిన విద్యార్థులకు పాస్ మార్కులు వేసి బేషరతుగా విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్ చేశారు...
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సొల్లు సాయి కుమార్,జంపాల అక్షయ్,జోగు అరవింద్, సూరు అభిషేక్,రేఖ,ప్రసన్న,ప్రకాష్,ప్రశాంత్ విద్యార్థులు పాల్గొన్నారు..