"బంద్ విజయవంతం"
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యనికి ఇంటర్ విద్యార్థులు ఫెయిల్.
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులందరిని పాస్ చేయాలి.
ఉచితంగా రీ వ్యాలువేషన్, రీ కౌంటింగ్ చేయాలి.
sfi మండల అధ్యక్షుడు సొల్లు సాయి కుమార్
ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు మోడల్ కాలేజ్ ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు సొల్లు సాయి కుమార్ మాట్లాడుతూ....
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో చాలా తక్కువ శాతం(49%) పాస్ కావడం, పాసైన వారిలో కూడా అనేక మంది విద్యార్దులకు తక్కువ మార్కులు రావడం ఇంటర్ బోర్డు వైపల్యనికి నిదర్శనం. కరోనా కారణంగా విద్యార్థులకు సరిగ్గా క్లాస్ లు జరగలేదు.విద్యార్థులు కూడా ఎవ్వరు పరీక్షలు రాయడానికి సంసిద్ధంగా లేని సమయంలో ఎలా రాసిన పాస్ చేస్తాము నామ మాత్రపు పరీక్షలే అన్న ఇంటర్ బోర్డు తప్పుడు నిర్ణయాల వలన ఇంత తక్కువ రిజల్ట్ వచ్చిందని అన్నారు ఇప్పుడు వచ్చిన రిజల్ట్ లో ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు పదో తరగతిలో పది /పది జీపీఏ గ్రేడ్ వచ్చిన వారు కూడా వుండటం ఈ పరీక్షల నిర్వహణ సమంజసం కాదనే విషయాన్ని తెలియజేస్తోంది. ఏప్రిల్ లో నిర్వహించాల్సిన పరీక్షలను ఆరు నెలలు ఆలశ్యంగా పెట్టినారు.కోవిడ్ వలన కాలేజీలు పనిచేయని విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు పెట్టినా విద్యార్థులు రాయలేరనే విషయాన్ని మిగితా, విద్యార్థి, తల్లిదండ్రుల చెప్పినా వినకపోవడం బోర్డు బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.ఇప్పటికైనా ఫెయిలైన విద్యార్థుల్లో ఆందోళనను, వత్తిడిని నివారించడానికి బోర్డు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది .ఫెయిలైన విద్యార్థులకు కనీస పాస్ మార్కులు ఇవ్వాలి.విద్యార్థులు సెకండియర్ లో వున్నందున,వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకోని అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాము.అధిక మార్కుల కోసం మరోసారి పరీక్షలు నిర్వహించాలినీ తక్షణమే పునరుమూల్యాంకనం చేపట్టాలని కోరుతున్నాము ఇంటర్ బోర్డు ఏకపక్ష నిర్ణయాల వలనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని భావిస్తుంది.విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం విద్యార్థులు కు సరైన న్యాయం జరిగేలా ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందని తెలిపారు.తక్షణమే విద్యార్థులకు ఇంటర్ బోర్డు సరైన వివరణ తో భరోసా యివ్వాలని కోరుతున్నామ డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు జంపాల అక్షయ్, ఎద్దు వెంకటేష్, ఆజిత్,తదితరులు పాల్గొన్నారు.