27డిసెంబర్,ఇల్లంతకుంట:
ఈ రోజు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో నా బార్డ్ వారి సహకారంతో IRDS స్వచ్ఛంధ సంస్థ గారి ఆద్వర్యంలో గ్రామంలో SHG మహిళలకు మగ్గం వర్క్ పై శిక్షణ శిభిరాన్ని ఈ రోజు స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో 30మంది SHG మహిళలకు 15రోజుల పాటు మధ్యాహ్న బోజనంతో పాటు ప్రతి రోజు స్ట్రైఫండ్ 50రూ!! లు నా బార్డ్ సహకారంతో IRDS స్వఛ్చంధ సంస్థ అందజేయడం చాలా అభినందనీయమని అన్నారు.దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.మీకు ఏమి అవసరము ఉన్న మీకు సహాయ సహాకారలు అందజేస్తానని అన్నారు.మహిళలు ఆర్థికంగా అభీవృద్ది చెంది స్వయం ఉపాది పొందాలని అన్నారు.దేశం అభివృద్ది చెందాలంటే మహిళల పాత్ర కీలకం అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మీసరగండ్ల అనిల్ కుమార్,పసుల వెంకట్,ల్యాగల బాగయ్య,ఎలవేని రమేశ్,IRDS సంస్థ డైరెక్టర్ K.రాజలింగం,వెలుగు CC లు కర్ణ,సత్య,సంస్థ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ CH బాలకి)ష్ణ,ట్రైనర్ రమ్య తదితరులు పాల్గొన్నారు.