ఇల్లంతకుంట వార్తలు,03 జనవరి :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆస్పత్రిలో ఎంపిపి వుట్కూరి వెంకట రమణా రెడ్డి సోమవారం కరోన వ్యాక్సిన్ టికా ను ప్రారంభించారు. మండలంలోని 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు. మండలంలో మొత్తం 1476 మంది కి కో వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. మండలంలోని అందరు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని, తప్పకుండా వ్యాక్సిన్ తో పాటుగా మాస్క్ లుఃధరించాలన్నారు. అదే విధంగా రక్తపరీక్షలు కూడా ఆస్పత్రిలో చేస్తున్నారని అవసరం ఉన్నవారు తప్పకుండా చేసు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బావుసింగ్, ఎంపిడిఓ జోగం రాజు, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మీ బాలరాజు, వైధ్యాధికారిణీ సుబాషిణీ, వైధ్యసిబ్బంది పాల్గొన్నారు.