ఇల్లంతకుంట వార్తలు:
ఈ రోజు ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ పనులను పరిశీలించి,అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్ గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ సహాకారంతో పేదల చిరకాలవాంఛైన డబుల్ బెడ్ రూం ల గృహ ప్రవేశం త్వరలోనే చేపట్టి నిరుపేదలకు నీడనందిస్తామని అన్నారు. పేద కుటుంబానికి స్వంత ఇంటి కల నిజం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబుల్ బెడ్ రూం పథకాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు
స్థానిక సర్పంచ్ సిద్దం శ్రీనివాస్,ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్,ఉప సర్పంచ్ ,బండారి పర్శరాములు,PACS డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి,వార్డ్ సభ్యులు, టీఆరెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కదురు శేఖర్ ,గుంటి అంజి,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.