ఈ రోజు కేశన్న పల్లె గ్రామము లో దళిత బందు పథకం లో ఎంపిక కాబడిన లబ్ధిదారులకు దళిత బందు పథకం గూర్చి పూర్తి స్థాయిలో వారికి అవగాహన కలిగించడము జరిగింది. మరియు లబ్ధిదారుల నుండి స్కీం ఎంపిక కొరకు జిల్లా స్థాయి అధికారులు వారి శాఖ నందు ప్రభుత్వ పథకములు ఉన్నవి వాటి వలన ఎంత లాభము వస్తుంది దాని వలన ఏమి ఉపయోగం కలుగుతుంది అని ప్రతి విషయము వారికి అవగాహన కల్పించి వారి నుండి ఆప్షన్ ఫామ్ తీసుకోవడము జరిగింది
ఇట్టి కార్యక్రమములో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్ మరియు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉపేందర్ , జిల్లా గ్రామీణాభివృద్ధి మరియు జిల్లా రవాణా శాఖ సిబ్బంది జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బంది బ్యాంకు లీడ్ మేనేజర్ మరియు బ్యాంకు అధికారులు మరియు మండలములోని అన్ని శాఖల స్థాయి అధికారులు మరియు స్ధానిక సర్పంచు మరియు ఎం.పి.టి.సి సభ్యులు మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు మరియు దళిత బంధు లబ్ధిదారులు అందరూ పాల్గొనడం జరిగింది.