రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల దళిత మోర్చా శాఖ ఆధ్వర్యంలో సంతు రవి దాస్ చిత్రపటానికి పూల వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ మాట్లాడుతూ సంతు రవి దాస్ , కవిత్వo బోధనల ద్వారా అంటరానితనం గురించి వివరించిన సామాజిక స్పృహ కలిగిన రవి దాస్ మానవులంతా ఒక్కటే అని చెప్పిన గొప్ప వ్యక్తి, కుల వృత్తిని చేసుకుంటూ ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలు పర్యటిస్తూ ఉపదేశాలు చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెంద్రం తిరుపతి రెడ్డి, నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, రంజిత్, మామిడి శేఖర్,బండారు రాజు, వజ్జపెల్లి శ్రీకాంత్, దామెర్ కృష్ణ, గజ్జెల శ్రీనివాస్, ఎలుక వర్ధన్, గొర్రె అఖిల్, సురేష్ లు పాల్గొన్నారు.