మానకొండూర్ నియోజకవర్గం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా లక్ష్మీపూర్ మరియు వెల్దిపూర్ గ్రామాల మధ్య విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ మెంబర్ వొరగంటి ఆనంద్ హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఘటనలో గాయాలపాలైన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు, విద్యార్థులకు మెరుగైన వైద్య చికత్సల నిమిత్తం వైద్యులతో చర్చించి వారి అరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు, అత్యవసర వైద్య సేవలకు కరీంనగర్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు,గాయపడిన విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపి తల్లిదండ్రులను ఆందోళన పడవద్దని వారిని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఫాక్స్ చైర్మన్ భూంపల్లి రాఘవరెడ్డి, వోరగంటి యువసేన నాయకులు తదితరులు ఉన్నారు.