జనశక్తి నక్సలైట్ల అసత్య/అబద్ధపు ప్లీనరీ సమావేశ ప్రచారాన్ని చేధించిన పోలీసులు
గత వారం రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా సరిహద్దు అటవీ ప్రాతంలో జనశక్తి నక్సలైట్ల ప్లీనరీ సమావేశం నిర్వహించినట్లు వివిధ పత్రికల్లో మరియు న్యూస్ ఛానెల్లో ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదు అని సిరిసిల్లలో అలాంటి సమావేశాలు ఏవి జరగలేదు అని జిల్లాలో ఎలాంటి నక్షలైట్స్ సంచారం లేదు అని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే IPS గారు ఈ రోజు జరిగిన పత్రిక సమావేశంలో వెల్లడించారు..
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతు...
ఫై అసత్య ప్రచారాన్ని తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్న సందర్భంలో నిన్న తేదీ 23-౦౩-2022 రోజున సాయంత్రం వేములవాడ పట్టణ శివారులో ధర్మారం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ గున్నల లక్ష్మణ్, ఒక మర్డర్ కేసులలో నిందుతుడు పోలీసులకు పట్టుబడినాడు. అతడిని విచారించగా తాను మరో మాజీ నక్సలైట్ అయిన పోతుగాళ్ సురేందర్ @ సురేష్ @ విశ్వనాధ్ అనునతడు మరి కొంతమంది సహచరులతో జిల్లాలో మరికొంత మందితో కలసి ఒక పథకం ప్రకారం సిరిసిల్ల జిల్లాలో నక్సలైట్ ల సమావేశాలు జరిగాయని అసత్య ప్రచారం చేసి ప్రజలను, వ్యాపారస్తులను, కాంట్రాక్టర్ లనుభయబ్రాంతులకు గురి చేసి అక్రమ వసూళ్లకు పాల్పడలనే దురుద్దేశంతో ఈ అసత్యపు ప్రచారానికి పూనుకున్నారు.. నిందితుని దగ్గర సింగల్ బోర్ తపంచ, ఏడు సెల్స్, ఒక మొబైల్ మరియు బైక్ స్వాధీనం చేసుకున్నారు.
సుమారు పదిహేను రోజుల క్రితం సురేందర్ @ సురేష్ @ విశ్వనాధ్, గున్నాల లక్ష్మణ్ మరో ముగ్గురు సహచరులతో కలిసి అయ్యోరుపల్లె గ్రామానికి చెందిన రాజమల్లయ్య దగ్గర వెళ్లి నీవు నంది కామన్ చౌరస్తా వద్ద అక్రమంగా రెండున్నర గుంటల భూమిని ఆక్రమించుకున్నావు అది మాకు ఇవ్వు లేదంటే నీ అంతు చూస్తామని బెదిరించారు. అతను భూమి ఇవ్వడానికి నిరాకరించినందున అదే రోజు పై ఐదుగురు నిందితులు రాజమల్లయ్యను చంపాలని పథకం వేసుకున్నారు. అందులో భాగంగానే గున్నాల లక్ష్మణ్ ఓక సింగల్ బొరె తపంచ తో, మిగితా నలుగురితో వేచిఉండగా పోలీసులు పట్టుకున్నారు...
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ప్రజలు ఎవరుకుడా భయపడవద్దు అని జిల్లాలో జిల్లాలో ఎలాంటి జనశక్తి సంచారం లేదు అని అన్నారు.అలాంటి సమాచారం ఉంటే దగ్గరలో గలా పోలీస్ స్టేషన్ లో సమాచార ఇవ్వాలని సూచించారు..జనశక్తి పెరు మీద ఎవరన్నా ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే సమాచారం అందివ్వాలని వారి మిద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని ఎస్పీ గారు అన్నారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య గారు,డిఎస్పీ లు చంద్రకాంత్ ,రవికుమార్, పాల్గొన్నారు.