ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో ఈరోజు గ్రామసర్పంచ్ *కాచం శ్రీనివాస్ రెడ్డి* హెల్త్ ప్రొఫైల్ స్క్రనింగ్ ను ప్రారంభించడం జరిగింది, ఈ హెల్త్ ప్రొఫైల్ స్క్రనింగ్ లో భాగంగా మండల వైద్య సిబ్బంది ఉచితంగా షుగర్, బీపీ, రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది, కాబట్టి గ్రామంలో 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వారు అడిగిన సమాచారం అందించి ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు నలువాల రాజు యాదవ్, ఎల్లంగౌడ్, శ్రీనివాస్,రూప, స్వప్న,జ్యోతి, సునీత, పంచాయితీ కార్యదర్శి ప్రియాంక, ANM దేవకి, ఆశలు శాంత, సుజాత మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
హెల్త్ ప్రొపైల్ స్క్రినింగ్ ను ప్రారంభించిన సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి
March 25, 2022
0
Tags
Share to other apps