రైతులకి మద్దతుగా రాస్తా రోకా చేసిన బీజేపీ నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల గాలిపెల్లి రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసి 52 రోజులైన డబ్బులు చెల్లించకపోవడంతో రైతులకి మద్దతుగా రాస్తా రోకా చేసిన బీజేపీ నాయకులు.
గాలిపెల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం నిర్వాహకులు రైతులు నుండి వడ్లు కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా రైతులకు డబ్బులు జామ చేయకపోవడంతో తాళ్లపెల్లి బస్టాండ్ వద్ద రైతుల రాస్తా రోకాకి మడ్దతుగా బెంద్రం తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడుతు రైతులు కష్టపడి వడ్లు పంటలు పండిస్తే వడ్లు పి ఎ సి సి ఎస్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు 52 దినములు గడిచిన రైతుల అకౌంట్లో డబ్బులు జామ కాకపోవడతో రైతులు బాధపడత్తు,రైతుల మళ్ళీ పంటలు వేసే సీజన్ వచ్చిన దుక్కిడున్నడానికి విత్తనాలకు, ఎరువులకు,అప్పులు తెచ్చి వ్యవసాయం వేసి వడ్లు పండిస్తే ఈ తెరాస ప్రభుత్వం,ఈ నిర్లక్ష్యపు తెరాస నాయకులు రైతులను తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుంటే రైతులు మల్లి ఎక్కడ అప్పులు తెచ్చి వ్యవసాయం చేయమంటారు, వడ్లు కొనుగోలు చేసినా మీకు రైతులకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత మీకు లేదాని పి ఎ సి సి ఎస్ లపై మండిపడ్డారు, వడ్లు కొనుగోలు చేసినప్పుడు అమాయకపు రైతులనుండి కింటాలూకి 6 కిలోల దోపిడీ చేసిన మిమ్మల్ని క్షమించిన రైతులకు ఇప్పుడు మల్లి డబ్బులు చెల్లించక రాస్తా రోకాలు చేస్తే స్థానిక ఎస్ ఐ వచ్చిసొసైటీ సి ఇ ఓ తో మాట్లాడి వారం రోజులలో డబ్బులు రైతుల అకౌంట్ లలో వేస్తామని హామీ ఇవ్వడంతో రైతులను సముదాయించి రాస్తా రోకా విరామింపజేశారు,సింగిరెడ్డి హనుమంతరెడ్డి,పల్లె. శ్రీనివాస్ రెడ్డి, ఆకుల.శ్రీనివాస్ రెడ్డి, పల్లి. కృష్ణ రెడ్డి, క్రిష్ట రెడ్డి,అబ్బు. రమణ రెడ్డి,గుగ్గిళ్ల. ఆంజనేయులు,బద్దం.రవీందర్ రెడ్డి,పల్లె.ప్రసాద్ రెడ్డి,సింగిరెడ్డి.ప్రవీణ్ రెడ్డి, గజ్జల.శ్రీనివాస్, బండారి.రాజు,వజ్జపెల్లి. శ్రీకాంత్, మధుకరెడ్డి తదితరులు పాలుగోన్నారు.