పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధికి పురోగతి

0
పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధికి పురోగతి
_డాక్టర్ శ్రీ రసమయి బాలకిషన్
_తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథిచైర్మేన్_
_మానకొండూర్ శాసన సభ్యులు_

_రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు 🌱నాటి ,ఆరోగ్య హస్పిటల్ వారి ఉచిత మెగా వైద్య శిభిరంను సందర్శించి అనంతరం ఇంకుడు గుంత మరియు జిమ్ సెంటర్లకు భూమి పూజ చేసినారు.
_గ్రామాల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మేన్  మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్ అన్నారు.

ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతు గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా దేశానికి ఆదర్శవంతంగా  మన గ్రామాలు మారాయని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 జాతీయ అవార్డులలో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి రావడమే నిదర్శనమని అని అన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెరిగాయని, ప్రతి గ్రామంలో నర్సరీ,వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, ట్రాక్టర్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రసమయి   అన్నారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్  దృష్టి సారించారని, గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత త్రాగునీటి సరఫరా చేస్తున్నామని, అక్కడ అక్కడ పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులు త్వరిత గతిన పూర్తి చేస్తామని అన్నారు. 
_రాష్ట్రంలో సీఎం కేసీఆర్  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో సైతం అమలు చేయడం లేదని అన్నారు.బిజెపి పరిపాలిస్తున్న 18 రాష్ట్రాలలో మిషన్ భగీరథ, రైతుబంధు రైతు జీవిత బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ , ఆసరా పింఛన్లు ,కేసీఆర్ కిట్స్, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందా అని  ప్రశ్నించారు.రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం దాన్యం కొనుగోలు నిరాకరించినప్పటికీ సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేశారని అన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top