హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

0

 హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో స్థానిక సర్పంచ్ రొండ్ల లక్ష్మి అధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ కరీంనగర్ వారి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించి గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే హాస్పిటల్ ఎండీ శ్రీకాంత్ రెడ్డి, వైద్యురాలు డా. ఆర్. లక్ష్మిని సన్మానించారు. 
ఈ శిబిరంలో 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, దాదాపుగా 30 వేల రూపాయల విలువ గల మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో స్థానిక సర్పంచ్ రొండ్ల లక్ష్మి, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, ప్యాక్స్ చైర్మన్ రొండ్ల తిరుపతి రెడ్డి, హాస్పిటల్ ఎండీ శ్రీకాంత్ రెడ్డి, వైద్యురాలు డా. ఆర్. లక్ష్మి, సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య యాదవ్, ఆరోగ్య హాస్పిటల్ సిబ్బంది, గ్రామ ప్రజలు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top