ముంపు గ్రామాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
జనం న్యూస్ , 29 ఆగస్టు, ఇల్లంతకుంట :
ఈరోజు ముంపు గ్రామాల సమస్యపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది ఇట్టి పిలుపు మేరకు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి తో ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ అనంతగిరి గ్రామ శాఖ అధ్యక్షులు కోలపూరి అంతగిరి తో పాటు వివిధ నాయకులు వేములవాడ నంది కమాన్ దగ్గర మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ , కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వం పెళ్లి సత్యనారాయణ మేడి పెళ్లి సత్యం లతోపాటు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టి ధర్నాలో పాల్గొనడం జరిగింది, పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జిల్లా పోలీస్ హెడ్ కోటర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఉంచడం జరిగింది, ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన హామీ ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు 5 లక్షల పరిహారం ఇప్పించాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇట్టి కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకట్ అల్లేపు రజినీకాంత్ అంతగిరి ప్రశాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.