ఎల్ ఓ సి పత్రాన్ని అందించిన వోరగంటి
జనం న్యూస్ , 7 సెప్టెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన నగునూరి లావణ్య కుమారుడు నగునూరి అభిరామ్ (15) మెదడు వాపు వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురై అత్యవసర చికిత్స కొరకై హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరగా తెలంగాణ ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్య వివరాల్ని వైద్యులను అడిగి తెలుసుకుని
చికిత్సకు అవసరమైన 1,50,000/ రూపాయల ఎల్ ఓ సి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు.
మా కుమారుని అత్యవసర వైద్య ఖర్చులకు అవసరమైన ఎల్ ఓ సి కొరకు సహకరించిన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి, మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావుకి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కి, రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ వారి కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.