ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ, సామాజిక ఉద్యమకారుడు మరియు మాజీ ఎంపీటీసీ గొల్ల మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ వారిని హైదరాబాద్ లో వారి ఇంటికెళ్ళి పరామర్శించి,ఆరోగ్య స్థితిగతులను గురించి అడిగి తెలుసుకొని, మనోధైర్యాన్ని నింపారు.