*సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలు పట్టివేత.* *సిరిసిల్ల డిఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ రైడ్
.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ద్విచక్రవాహనంలకు ఎలాంటి నెంబర్లు లేకుండా సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా తిరుగుతున్న 35 ద్విచక్రవాహనంలను పట్టుకున్నారు.ద్విచక్రవాహనంలకు ఎలాంటి నెంబర్లు లేకుండా తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్న దృష్ట్యా స్పెషల్ రైడ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ విశ్వప్రసాద్ ఎల్లారెడ్డిపేట సిఐ మొగిలి,గంభీరావుపేట ఎస్ ఐ మహేష్, ఎల్లారెడ్డిపేట ఎస్.ఐ వి శేఖర్ లు పాల్గొన్నారు.